Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జెలెన్‌స్కీ సరైన వ్యక్తి కాదు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Zelenskyy is not the right person Trump sensational remarks
Advertisement
  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్ తీవ్ర విమర్శలు
  • పుతిన్‌తో కంటే జెలెన్‌స్కీతో వ్యవహరించడమే కష్టమన్న ట్రంప్
  • ఉక్రెయిన్ ప్రజలు మరో వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదని సూచన
Advertisement
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జెలెన్‌స్కీ అమెరికాతో వ్యవహరించడానికి సరైన వ్యక్తి కాదని, రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అతనితో చర్చలు జరపడమే కష్టంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రజలు మరో నాయకుడిని ఎన్నుకుంటే మంచిదని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ మళ్ళీ దాడులు ప్రారంభించడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను అవమానకరంగా ఆయన అభివర్ణించారు. శాంతి కావాలని పైకి చెబుతూనే, జెలెన్‌స్కీ యుద్ధాన్ని కొనసాగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రపంచానికి ఇంధనం అవసరమైన తరుణంలో రిఫైనరీలపై దాడులు చేయడం సరికాదన్నారు.

కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన 'ఇంధన కాల్పుల విరమణ' ఒప్పందాన్ని రష్యా గౌరవించలేదని ఉక్రెయిన్ ఆరోపించింది. విరామ సమయంలోనూ రష్యా తమ ఇంధన వ్యవస్థలపై దాడులు కొనసాగించిందని, అందుకే తాము తిరిగి దాడులు ప్రారంభించాల్సి వచ్చిందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. దాడులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.
ఈ పరిణామాల నడుమ, ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని రియాజాన్ ప్రాంతంలో ఉన్న ఆయిల్ రిఫైనరీపై దాడి చేయగా, భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు, మధ్య ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ తారస్థాయికి చేరాయి.
Advertisement
Advertisement
Donald Trump
Volodymyr Zelenskyy
Russia Ukraine War
Vladimir Putin
Russian Oil Refineries
US Ukraine Relations

More Telugu News